Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Website: https://www.newcity.in

మంచి ఆరోగ్యము, సఫలవంతమైన సంబంధాలు, తృప్తినిచ్చే ఉద్యోగము లేదా సేవా పరిచర్య కలిగియుండుట చాలా కష్టం అనిపిస్తుందా? ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులోని సరళత ద్వారా ఈ ఆశీర్వాదాలన్నిటినీ మనము సుళువుగా ఆస్వాదించే రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. ఈ వర్తమానంలో నూతన నిబంధన పాత నిబంధనను ఎలా అధిగమిస్తుందో, ఈ రెండింటినీ కలపడం వల్ల కలిగే ప్రమాదాలను మనము కనుగొంటాము మరియు దేనినైనా పొందుకొనుటకు దేవుని కృప, మన విశ్వాసమే కీలకమని నేర్చుకుంటాము. మీ పనులు సులభతరమవుతే, మీ విశ్వాసము హెచ్చవుతుంది. అప్పుడు ఆశీర్వాదాలు మెండవుతాయి.

దేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి. ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు: • సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతముగా. • దుష్టులు మరియు నీతిమంతుల మీద ఈ 3 విధానాల ప్రభావము. • విశ్వాసులు, దుష్టులు మరియు దేవుడు ఎలా ఈ సంపద బదిలీ జరిగే ప్రతి విధానాన్ని నిర్ణయిస్తారు? • దేవుని రాజ్య సంపదను బలోపేతం చేసే జ్ఞానపు 5 కోణాలు. • పాపాత్ముడు పోగు చేసినదానంతటితో సహా ఒక మంచి వ్యక్తి ఎలా ఙ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని పొందుకుంటాడు? మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని రాజ్యపు సంపదను గురించి మీకున్న జ్ఞానము పెరిగి, నమ్మకమైన గృహనిర్వాహకునిగా ఉండుటకు మీరు దైవిక జ్ఞానములో ఎదుగుతూ గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక!

ఆర్థికంగా మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరింతగా చేయాలని కోరుతున్నారా? అయితే, ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తలాంతుల యొక్క ఉపమానము ద్వారా ఆర్థిక విషయాలను గురించిన కాలాతీతమైన వాక్య జ్ఞానాన్ని పంచుకుంటూండగా వినండి. మీరీ సందేశాన్ని వింటూండగా మీ వనరులను జ్ఞానయుక్తంగా నిర్వహిస్తూ దేవుని రాజ్యంలో ధారాళంగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రేరణ పొందాలని మా ప్రార్థన. మీరు అమితంగా ఆశీర్వదించబడి గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక.

గురుగుల మధ్యలో కూడా గోధుమ వలె పెరగండి! రూపాంతరం చెందిన వ్యక్తులు లోకపు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో, దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించే గోధుమలు గురుగులు అనే ఉపమానము ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనకు ఈ వర్తమానంలో చూపిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా మీ కోరికలు, పనులు మరియు మీ జీవితము ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గురించి ఒక సారి ఆలోచించండి. మంచి మార్పును తీసుకువచ్చే గోధుమ వలె, చీకటిలో వెలుగుగా ప్రకాశించడానికి మీ జీవితములో మూడు తక్షణ చర్యలను ఇప్పుడే తీసుకోండి. మీరు సరైన నేలలో ఇష్టపూర్వకంగా నాటబడిన విత్తనంగా ఉండి, దేవుని మహిమ కోసం శాశ్వత ప్రభావాన్ని చూపుదురు గాక!

అర్థవంతమైన విధానాల్లో, లోకము గమనించునట్లు దేవుని మహిమను ప్రతిబింబించగలిగే దైవికమైన కృపను ఎలా పొందుకోవాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు విశ్వాసులను బలపరుస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమార్థమై మీరు అధికముగా ఫలించుటకున్న దైవిక క్రమాన్ని పాటించుటకు కట్టుబడియుండి, తద్వారా క్రీస్తు రక్షణ కృప వైపునకు ప్రజలను త్రిప్పుతారని మా ప్రార్థన. దేవుని మహిమను కనపరచుటకు మీరు ఏర్పరచబడ్డారు. ఆ మహిమలో నడుస్తూ ఉండండి!

గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి. మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూతన బలం మరియు ధైర్యంతో నడుస్తూ ఉందురు గాక. యేసు నామంలో, ఆమేన్!

The Glory of God, The Victory of All In this powerful sermon, Pastor Benjamin Komanapalli Jr. talks about the privilege and importance of manifesting God's glory to see real change in the world around us. As you listen, we pray that you position yourself on the rock of Jesus and take on the responsibility of showing God's glory in and through your life. May your life be filled with the glory of God. In Jesus' name, Amen! దేవుని మహిమ, మనందరి విజయము మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును చూచుటకు దేవుని మహిమను మనము కనబరచే ఆధిక్యత మరియు ప్రాముఖ్యతను గురించి ఈ శక్తివంతమైన వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు సరియైన స్థానంలో ఉంచుకొని, మీ జీవితాలలో, జీవితాల ద్వారా దేవుని మహిమను చూపే బాధ్యతను తీసుకుంటారని మా ప్రార్థన. మీ జీవితాలు దేవుని మహిమ చేత నింపబడును గాక. యేసు నామములో, ఆమేన్!

మీకై ఉన్న దైవిక గమ్యాన్ని చేరుకొనుట: నిజమైన విజయానికి యాత్ర! ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దైవిక గమ్యానికి అర్థం, దానిని చేరుకొనే మార్గాలు, మీకై ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని కనుగొన్న తరువాత చేయాల్సిన పనులను గురించి ఎంతో స్ఫూర్తిదాయకమైన వర్తమానాన్ని అందిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా దేవుడు మీకై ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ, సమాధానం, మంచి భవిష్యత్తు గురించినవై ఉన్నాయనే సత్యంలో మీరు వేరుపారాలని మా ప్రార్థన! నిజమైన విజయాన్ని చేరుకొనులాగున దేవుని వాక్యానికి మీ జీవితమంతా విధేయత చూపుచు నడిపింపబడుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన. నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమైన విజయాన్ని, దేవునికి మహిమను తెచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు. ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, మీకై దేవునికున్న ప్రణాళికను నమ్ముటకు ప్రేరేపించబడి, విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు ప్రోత్సాహపరచబడాలని మా ప్రార్థన. మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!

దేవుని ప్రణాళిక - శ్రేష్ఠమైన ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మన ప్రేమగల సృష్టికర్తచే రూపింపబడ్డాయని, ఆ ప్రణాళికను మనము కనుగొని దానిలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడనే ప్రోత్సాహపూర్వక సత్యాన్ని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశంలో బోధిస్తున్నారు. దేవుని ప్రణాళికను మనము గుర్తించకపోవుటకు గల కారణాలను పాస్టర్ గారు వివరిస్తుండగా, మీరింత వరకు గడిపిన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించండి. తరువాత మీ పట్ల దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళికను మీకు తెలుపమని దేవునిని అడగండి. దేవుని మహిమార్థమై, మీరు సరైన దిశలో నడుస్తూ, సరైన గమ్యాన్ని చేరుకొందురు గాక. యేసు నామములో, ఆమేన్!

ఇది ఎదుగుటకు సమయం! ఈ పాడ్కాస్ట్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఒక విశ్వాసి జీవితంలో ఎదుగుదల ఒక్కొక్కటిగా ఎలా దశలలో జరుగుతుందో వివరిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమ కోసం మీ విశ్వాస జీవితములో ఎవ్వరూ వివరించలేని ఎదుగుదలను చూడటానికి ఆయన సత్య వాక్యము ద్వారా దేవునితో కలిసి మీరు పని చేయడానికి నిర్ణయించుకోవాలని మా ప్రార్థన!

మీ నాలుక: మీ విడుదలకు మూలము ఎంతో దైవిక జ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తిని మనము ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తున్నారు. మీ జీవితాన్ని మరియు ఇతరులను ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ జీవమునే పలుకుతూ ఉండుటకు ఇప్పుడే నిర్ణయించుకోండి. మీ మాటలు దేవుని వాక్యానికనుగుణంగా ఉంటూ, మీ జీవితములో మీకు సమృద్ధియైన పంటను ఇచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

విత్తుట మరియు కోయుటలోని శక్తి! ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వెదకాలము, కోతకాలములు అను బైబిల్ సూత్రాన్ని వివరిస్తుండగా మీ జీవితంలో శాశ్వతమైన మార్పునకు సూత్రాన్ని కనుగొనండి. మీరు చేస్తున్న పనులనొకసారి పరీక్షించుకొని, వాటిని దేవుని వాక్యానికనుగుణంగా మార్చుకొనడం ద్వారా మీ జీవితము ఎలా సంపూర్ణంగా మారిపోగలదో తెలుసుకోండి.

శిక్షావిధి - ఒక భయంకరమైన వేదన నీకు నేనంత మంచివాడను/మంచిదానను కాదు అనిపిస్తుంటుందా? ఏవైనా అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నించి ప్రతి సారి ఓటమి పాలయ్యావా? సానుకూల ఒప్పుకోలు చేస్తూ, నిపుణతగల మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ వాటితో ఏం ప్రయోజనం లేక చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా? లేఖనాధారంగా ఉన్న ఈ విడుదలనిచ్చే సందేశంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు ఒక తుది పరిష్కారాన్నిస్తునారు: క్రీస్తుని అంగీకరించి, ఆయన రక్షణలో విశ్రమించుట. తగిన ఉదాహారణలనిస్తూ శిక్షావిధి నుంచి విడుదలై స్వేచ్ఛగా జీవించుట అనేది కేవలం సాధ్యమే గాక అది నిజమైన స్వాతంత్ర్యానికి మూలం అని ఆయన చెపుతున్నారు. ఈ సందేశాన్ని విని, ఎటువంటి అపరాధ భావన, అవమాన భారము లేని ధైర్యము, శక్తితో కూడిన స్వేచ్చా జీవితాన్ని జీవించుటకు శక్తిని పొందండి. ఆమేన్! శిక్షావిధి లేని జీవితము జీవించుట శిక్షావిధి - ఒక భయంకరమైన వేదన నీకు నేనంత మంచివాడను/మంచిదానను కాదు అనిపిస్తుంటుందా? ఏవైనా అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నించి ప్రతి సారి ఓటమి పాలయ్యావా? సానుకూల ఒప్పుకోలు చేస్తూ, నిపుణతగల మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ వాటితో ఏం ప్రయోజనం లేక చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా? లేఖనాధారంగా ఉన్న ఈ విడుదలనిచ్చే సందేశంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు ఒక తుది పరిష్కారాన్నిస్తునారు: క్రీస్తుని అంగీకరించి, ఆయన రక్షణలో విశ్రమించుట. తగిన ఉదాహారణలనిస్తూ శిక్షావిధి నుంచి విడుదలై స్వేచ్ఛగా జీవించుట అనేది కేవలం సాధ్యమే గాక అది నిజమైన స్వాతంత్ర్యానికి మూలం అని ఆయన చెపుతున్నారు. ఈ సందేశాన్ని విని, ఎటువంటి అపరాధ భావన, అవమాన భారము లేని ధైర్యము, శక్తితో కూడిన స్వేచ్చా జీవితాన్ని జీవించుటకు శక్తిని పొందండి. ఆమేన్!

మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను మర్మము ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు సిలువ తర్వాత జీవించుచున్న వారికి ప్రత్యేకంగా ఉన్న గొప్ప ఆధిక్యతను వెల్లడిస్తున్నారు: అది, క్రీస్తు మనలో నివసించుట, మనం ఆయనలో నివసించుట అనే మర్మము. మీరు వ్యాపారస్తులైనా, తల్లిదండ్రులైనా, వైద్య నిపుణులైనా, విద్యావేత్తలైనా, లేదా దేవుని సేవకులైనా, క్రీస్తును మరియు ఆయన సిలువ మరణాన్ని తెలుసుకొనుటపై మీ దృష్టిని కేంద్రీకరించి, దైవిక ఫలితాలను అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు క్రీస్తులో ఇది వరకే ఏమైయున్నారో, అలా అవుటకు ప్రయత్నించడం మానివేసి, దేవుని సంపూర్ణతలో నడుస్తూ, ఆయన శక్తిని ఇతరులకు చూపించుదురు గాక. యేసు నామంలో, ఆమేన్.

ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు బైబిల్‌లోని గత మరియు ప్రస్తుత సత్యాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని అర్థం చేసుకోవడంలో సందర్భం మరియు సమయాన్ని వివేచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుడు మనకిచ్చిన సమృద్ధి జీవితాన్ని దోచుకునే సంప్రదాయాలను తిరస్కరించాలని మరియు సిలువ తర్వాత క్రీస్తు మనకిచ్చిన జీవితము మనము జీవించడము గొప్ప భాగ్యం, ఆధిక్యత అని మనము గ్రహించాలని మా ప్రార్థన. దేవుడు ఈ కాలములో చేస్తున్న దానంతటికీ మీ కళ్ళు, చెవులు, హృదయము ఎల్లప్పుడూ తెరచి ఉండును గాక. యేసు నామములో, ఆమేన్!

పరిశుద్ధాత్మ అగ్ని - విశ్వాసి యొక్క ఆయుధం మరియు హృదయవాంఛ ఈ పెంతెకొస్తు ఆదివార ప్రసంగంలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు పెంతెకొస్తు దిన ప్రాముఖ్యతను, దేవుని వాక్యానికి మరియు ఆయన ఆత్మకు మధ్య ఉన్న అవినాభావ బంధాన్ని మరియు అన్య భాషల్లో మాట్లాడే రుజువుతో పరిశుద్ధాత్మతో నింపబడి, తిరిగి నింపబడవలసిన ఆవశ్యకతను తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, పరిశుద్ధాత్మ సన్నిధి మీలో వెలిగింపబడి, దేవుని మహిమార్థమై రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని లేపుటకు మీరు శక్తినొందుదురు గాక. లోకము మీ ద్వారా అందరినీ దేవుని ప్రేమ మరియు శక్తితో వెలిగించు పరిశుద్ధాత్మ యొక్క రూపాంతర శక్తిని చూచును గాక. యేసు నామములో, ఆమేన్!

ఈ సందేశంలో పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు విమోచన మనకు దేవుని ఆశీర్వాదమనే ద్వారంగా ఎలా మారుతుందో తెలుపుతున్నారు. ఇక్కడ వారు శాపాలు, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ, శాపాలు కాదు కానీ, ఆశీర్వాదాలే మన పట్ల దేవుని ప్రణాళిక అని మనకు తెలియజేస్తున్నారు. దేవుడు మన క్షేమాన్నే కోరి, మనలను ఆశీర్వదిస్తాడు. క్రీస్తు మనలను శాపము నుండి విమోచించి, మనము ఆశీర్వదించబడునట్లుగా తానే శాపముగా మారాడు. ఒక విశ్వాసి ఏ శాపగ్రస్తమైన పరిస్థితి లేదా సందర్భము కింద జీవించాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని విశ్వాసమే తెరుస్తుంది.

కేవలము నమ్ము. సుళువుగా పొందుకో. ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు క్రైస్తవ జీవనము గురించిన ఒక ఆవశ్యకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు: దేవునికి ఇష్టులైయుండుటకు విశ్వాసం ద్వారానే మనము నడవడం తప్పనిసరి. మీరీ వాక్యము ద్వారా ప్రేరణ పొంది, క్రీస్తు కథను అతి క్షుణ్ణంగా అభ్యసించి ఆయన మాదిరిని సాధన చేయడానికి నిర్ణయించుకోవాలని మరియు ఏది ఏమైనా సరే విశ్వాసం ద్వారానే స్థిరంగా నడుస్తూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. దేవుని మహిమ కొరకు మీ విశ్వాస జీవితం ఇతరులకు ఒక మాదిరిగా ఉండుగాక. ఆమేన్!

మాతృత్వము: ఒక ధన్యకరమైన పిలుపు పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు మాతృ దినోత్సవం సందర్భంగా ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని పంచుకుంటున్నారు. తమ పిల్లల విశ్వాసాన్ని రూపొందించడంలో మరియు క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఇతర యవ్వన స్త్రీల ఆత్మీయ వృద్ధిని పెంపొందించడంలో క్రైస్తవ తల్లులకున్న కీలక పాత్రను ఆయన నొక్కి చెబుతున్నారు. మీరీ వర్తమానాన్ని వింటూండగా గతంలో ఎదుర్కొనియున్న ఏదైనా గాయం నుండి మీరు స్వస్థత పొందాలని మరియు దేవుని కృప ద్వారా మీరు ముందుకు సాగడానికి శక్తి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. మీ పిల్లల కొరకు మీరు దైవిక వారసత్వాన్ని వదిలి వెళ్లి, వారు మీ నిస్వార్థ ప్రేమ, అంకితభావం మరియు విశ్వాసాన్ని కృతజ్ఞతతో కొనియాడుదురు గాక. యేసు నామంలో, ఆమేన్!

యోధుని చేతిలో బాణములు తల్లిదండ్రులు మరియు సంరక్షకుల కోసమైన ఈ అమూల్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు దైవిక పెంపకం గురించి ముఖ్యాంశాలను పంచుకుంటున్నారు. ప్రత్యేకముగా దృష్టి సారించాల్సిన ముఖ్యమైన రంగాలను నొక్కి చెబుతూ, భావోద్వేగపరంగా స్థిరంగా ఉండే పిల్లలను పెంచడానికి ఆచరణాత్మక మార్గాలు మరియు పిల్లల పెంపకములో నివారించాల్సిన సాధారణ లోపాలను తెలియజేస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా తల్లిదండ్రులుగా మీ విశేషాధికారాన్ని స్వీకరించి, పదునుపెట్టబడి, చక్కగా రూపింపబడి మరియు శిక్షణ పొంది, పూర్తిగా సన్నద్ధమై ఈ లోకములోనికి ప్రవేశపెట్టబడిన పిల్లలను పెంచడానికి మీరు కట్టుబడి ఉంటారని మేము ప్రార్థిస్తున్నాము. దైవికమైన జీవితాన్ని మాదిరి చూపించుట ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చే తరాన్ని పెంచే యోధులుగా ఉండుటకు దేవునిచే పిలువబడిన వారిగా మీరు ఉందురు గాక. ఆమేన్!

క్రీస్తు పునరుత్థానము - దేవుని శక్తి కార్య రూపం దాల్చుట ఈ ఈస్టర్ సందేశములో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు యేసు యొక్క పునరుత్థానము యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వలన మనపై ఈ నాడు ఉన్న ప్రభావాలను తెలుపుతున్నారు. మీరు ఈ వర్తమానాన్ని వింటూండగా, దేవుని పునరుత్థాన శక్తిలో మీరు నడచుట మీ కోరిక కావాలని, తద్వారా దేవుని రాజ్యం కోసం మీరు ప్రభావవంతంగా జీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ పునరుత్థాన శక్తి మీపై తుడిచివేయబడలేని శాశ్వతమైన ముద్రగా ఉండును గాక. ఆమేన్!

రాజు, ఆయన రాజ్యం ఈ మట్టలాదివార సందేశంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు యేసు క్రీస్తు రాజరికాన్ని నొక్కి చెబుతూ దేవుని రాజ్యంలో భాగం కావడం వల్ల మనకు కలిగే పరివర్తనాత్మక ప్రయోజనాలను తెలుపుతున్నారు. పౌరులుగా మనం క్షమాపణ, నిత్యజీవము, పుత్రత్వము, శాంతి, ఆనందం, జ్ఞానం మరియు మరిన్నింటిని ఎలా ఆస్వాదించవచ్చో ఇక్కడ కనుగొనండి. మన రాజు యొక్క సర్వాధిపత్యము మరియు ఆయన త్యాగాన్ని ధ్యానిస్తుండగా మీరు దేవుని సంపూర్ణతలో నడుస్తూ ఆయనను ఘనపరిచే జీవితాన్ని జీవించుదురు గాక. ఆమేన్!

ఈ వర్తమానంలో పాస్టర్ బెన్ గారు పంటను కోయుటకు కీలక అంశాలు తెలియజేస్తుండగా మనము విందాం. విత్తుట మరియు కోయుట అనే నియమాన్ని ఆయన ఇక్కడ నొక్కి చెపుతున్నారు. మనమేమి విత్తుతామో, అదే పంట కోస్తాము. విత్తడము, కోయడము మన బాధ్యత, పంటను అభివృద్ధి పరచుట దేవుని బాధ్యత. మీ జీవితములో దేవునికి ప్రాధాన్యతనిచ్చి, విధేయత చూపించి మరియు ఆయనను సేవిస్తూ ఉంటే, దేవుని సమకూర్పును, అభివృద్ధిని మీరు అనుభవిస్తారు. ఆశీర్వదింపబడండి!!

దేవుని యొక్క ఆశీర్వాదము మన సఫలత మరియు అభివృద్ధి దేవుని చిత్తము అనే విషయాన్ని నొక్కి చెబుతూ, అబ్రాహాము, అతని సంతానానికి ఇవ్వబడిన అదే ఆశీర్వాదము మరియు శక్తి ఎలా విశ్వాసులమైన మనకిప్పుడు లభించాయో అనే అంశాన్ని పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు మనకిక్కడ తెలుపుతున్నారు. అబ్రాహాము ఆశీర్వాదమే మన పైకి కూడా వచ్చుటకు క్రీస్తు చేసిన శాప విమోచన కార్యాన్ని నొక్కి చెబుతూ, మనము ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించుటయే దేవుని కోరిక అని ఈ పాడ్కాస్ట్ ముఖ్యాంశముగా పేర్కొంటుంది. ఆశీర్వదింపబడండి!

ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నా, కరవు లాంటి కాలములో కూడా విత్తుతూ ఉండండి. త్వరలోనే సమృద్ధి అనే పుష్కలమైన నీటిలో మీరు ఈదుతుంటారు. మీ ఆర్థిక విషయాల్లో మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? పాస్టర్ బెన్ గారి వద్ద మీ కోసం సరైన వాక్యముంది. అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డల కొరకు ఎలా అన్నీ సమకూరుస్తాడో ఈ పాడకాస్ట్లో తెలుసుకోండి. లోకము మీ భాగ్యాన్ని చూసి అసూయపడి, సమస్తాన్ని సమకూర్చే మన దేవుని వైపు నడిపించబడును గాక. యేసు నామములో, ఆమేన్!

పాస్టర్ బెన్ కోమనాపల్లి జూనియర్ గారు విశ్వాసం ద్వారా జీవించడం గురించి ప్రసంగించారు వినండి. వారు - విశ్వాస మూలముగా జీవించుట అను క్రొత్త శీర్షికకు పునాది వేశారు వారు విశ్వాసము 'ఎందుకు' మరియు విశ్వాసం అనగా 'ఏమిటి' గురించి, మరియు విశ్వాసం యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి కారణాల గురించి ప్రసంగించారు. మీరు ఈ శక్తివంతమైన పోడ్‌కాస్ట్ వింటున్నప్పుడు, విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో మీరు అర్థం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏకైక మార్గం విశ్వాస మూలముగా జీవించడం.

ఎంచుకొనుటకు స్వతంత్రులైయున్నారు చేయుటకు స్వతంత్రులైయున్నారు ఉండుటకు స్వతంత్రులైయున్నారు పాస్టర్ బెన్ గారు ప్రసంగించిన ఈ శక్తివంతమైన పోడ్‌కాస్ట్‌లో దేవుని ప్రతి బిడ్డకు చెందిన మర్మమును, వాస్తవికత మరియు స్వేచ్ఛను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు వింటున్నప్పుడు, నూతన సృష్టి గుర్తింపును మరియు మీరు దేవుని ప్రయోజనాలలో మరియు ఆయన సంపూర్ణతలో నడవవలసిన స్వేచ్ఛ గురించి మీ అవగాహనను సవాలుగా పునపరిశీలించమని మేము ప్రార్థిస్తున్నాము. మీ జీవితంలో స్వేచ్ఛను పాలించనివ్వండి. ఆమేన్!

మీరు ఎవరు? మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ స్థానం ఏమిటి? ఈ పోడ్‌కాస్ట్‌లో, పాస్టర్ బెన్ గారు. శత్రువు యొక్క మోసాన్ని అధిగమించి సమృద్ధిగా జీవించడంలో దేవుని సత్యాన్ని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, క్రీస్తులో వారి నిజమైన గుర్తింపును కనుగొనడంలో విశ్వాసులకు మార్గనిర్దేశం చేశారు. మీరు వింటున్నప్పుడు, మీ నిజమైన దేవుడు ఇచ్చిన గుర్తింపును మీరు స్వీకరించాలని మేము ప్రార్థిస్తున్నాము, తద్వారా మీరు దేవుని సంపూర్ణతలో నడవగలరు. మీ యథార్థతకు క్రీస్తు మాత్రమే నిశ్చయమని మీరు తెలుసుకోగలరు. ఆమెన్!

ప్రయాసంలో విశ్రాంతిని పొందినప్పుడు, విడుదల కనిపిస్తుంది క్రీస్తులో మీ గుర్తింపు మీ విడుదలకు కీలకం. ఈ పోడ్‌కాస్ట్‌లో, పాస్టర్. బెన్ గారు మీ విడుదలను స్వీకరించడం మరియు కొనసాగించడం గురించి శక్తివంతమైన సత్యాలను పంచుకున్నారు. మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీ అవసరానికి ముందే ఆయన సమకూర్పు ఉందని తెలుసుకుని మీరు దేవుని ప్రత్యేక విశ్రాంతిలో ప్రవేశించమని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో మీ విడుదలను విప్పుటకు సిద్ధంగా ఉండండి. ఆమెన్!

యేసును ఎరుగుట పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు యేసును ఎరుగుటను గురించి ప్రసంగించారు వినండి. యేసు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? రక్షకుడైన యేసు అవసరం ఉందా? మనిషి తనను తాను రక్షించుకోవడం అసాధ్యం. మనకు రక్షకుడు కావాలి మరియు క్రిస్మస్ రోజు ఇప్పటివరకు జరిగిన గొప్ప అద్భుతాన్ని సూచిస్తుంది. మనందరినీ రక్షించడానికి దేవుని కుమారుడు ఈ పాపపు లోకంలోకి వచ్చాడు. ఆయన మన కొరకు పాపం అయ్యాడు. మన పాపం ఆయన నీతితో మార్చబడింది. మీరు ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్నప్పుడు, దేవుని యెదుట నిలబడి, దేవునికి సమర్పించుకోండి మరియు మీ జీవితాల్లో ఆయన మేలులను అనుభవించండి. ఆశీర్వదించబడండి!

ఇచ్చుట వృద్ధి చెందుట పాస్టర్ బెన్‌గారి ప్రసంగము, దేవుడు తన సమస్తాన్ని ఎలా ఇచ్చాడో మనకు గుర్తుచేస్తునారు, తద్వారా మనం అన్నింటినీ కలిగి ఉంటాము మరియు సవాళ్లు, సూత్రాలు మరియు వివిధ రకాల ఇచ్చుటను అన్వేషిస్తూ దాతృత్వపు హృదయాన్ని పెంపొందించుకోవడానికి మాకు శక్తినిచ్చాడు. మీరు వింటున్నప్పుడు, విశ్వాసం, దృష్టి మరియు ఉద్దేశ్యం ఉన్న స్థితి నుండి ఇవ్వడానికి మీరు ప్రేరేపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము దారాలముగా ఇచ్చుట అభివృద్ధిలో జీవించుట

నూరంతల పంట నూతన సంవత్సరం సమీపిస్తున్నందున, పాస్టర్ అర్పిత కొమనపల్లి గారు వాక్యాన్ని ఎలా స్వీకరించాలి మరియు వందరెట్లు పంటను పొందడానికి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దానిపై వారు ప్రసంగించారు విత్తువాడు యొక్క ఉపమానం ద్వారా, వాక్యం ఎలా వస్తుంది, అది ఎలా పని చేస్తుంది మరియు మనం వాక్యాన్ని ఎలా స్వీకరించాలో వారు వివరించారు. మీరు ఈ పోడ్‌కాస్ట్‌ని వింటున్నప్పుడు, దేవుని వాక్యమే సంఘానికి పునాది అని గుర్తుంచుకోండి. మంచి నేలపై పడిన విత్తనం పెరగడం ప్రారంభించినట్లే, దేవుని వాక్యం మీలో లోతుగా మరియు పెరగడం ప్రారంభించి, మీరు వందరెట్లు పంటను పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్!