TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.
వ్యాధులను దూరంగా ఉంచడానికి బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది ఎంతో ముఖ్యం. మరి ఈ రోగనిరోధక శక్తి చిన్న పిల్లలలో పెరగటానికి ఆయుర్వేదం ఏమి చెప్తుంది? ఎలాంటి జీవనశైలి అవలంబించాలి? తల్లిపాల వలన వచ్చే లాభాలుఏమిటి? ఏ వయసు వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఎలాంటి చిట్కాలు పాటించటం ద్వారా పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చు అనే విషయాలు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు డా|| అనుపమ గారు.. తప్పక వినండి.Dr. Anupama explains how to boost children's immunity through Ayurveda, breastfeeding benefits, ideal lifestyle habits, and age-wise diet tips in this insightful podcast. A must-listen for parents!Host: RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #AyurvedamArogyam #ChildImmunity #AyurvedaForKids #ParentingTips #HealthyLifestyle #BreastfeedingBenefits #TouchALife #TALRadio
చిన్నతనం నుండి తనకంటూ స్వంత గుర్తింపు ఉండాలని కలలుకంటూ, తనకు తెలిసిన వంట తోనే ఏదైనా చేద్దాం అని ప్రయత్నించి, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఆరోగ్యకరమైన శాఖాహార వంటకాలు (Healthy Vegetarian Recipes) ఎలా చెయ్యాలో శిక్షణ ఇస్తూ, పలు టీవీ చానెల్స్ లో ఎక్స్పర్ట్ గా వ్యవహరిస్తూ తన జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకున్న సూర్య లక్ష్మి గారి స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.Driven by a passion for cooking and self-identity, Surya Lakshmi turned her love for vegetarian recipes into a global mission, now inspiring many through TV and training. Discover her inspiring journey in this podcast.Host : RenusreeGuest : Suryalaxmi#TALRadioTelugu #InspiringWomen #HealthyCooking #VegetarianRecipes #CulinaryJourney #WomenEntrepreneurs #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఒంగోలు పరిసర ప్రాంతమైన వెంగముక్కపాలెం గ్రామానికి చెందిన మాణిక్యం గారితో మాట్లాడుకుందాం. ఆమె ఒక వ్యవసాయ కుటుంబానికి కోడలిగా వెళ్లి, వ్యవసాయం నేర్చుకున్నారు. అలాగే ప్రకృతిపై ప్రేమను పెంచుకొని, మా గృహిణి పేరిట సహజ సిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నారు. ఈమె చిన్ననాటి ప్రయాణం, అసలు ఈ నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.In this episode of Maa Ooru, we talk to Manikyam from Vengamukkapalem, Ongole. A farmer's daughter-in-law turned natural beauty product maker, she shares her inspiring journey and love for nature.Host : UshaGuest : Manikyam#TALRadioTelugu #MaaOoru #RuralStories #NaturalBeautyProducts #WomenEntrepreneurs #SustainableLiving #MaaOoruPodcast #TouchAlife #TALRadio
రైతులు మరియు వారి వ్యవసాయం సుస్థిరంగా కొనసాగాలంటే — ఆర్థిక సుస్థిరత, పర్యావరణ సుస్థిరత రెండూ అత్యంత ముఖ్యమైనవి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సుస్థిర వ్యవసాయ కేంద్రాన్ని ప్రారంభించామని చెబుతున్నారు డా. రామాంజనేయులు గారు. ఆహార భద్రత దేశానికి ఎంత ముఖ్యమో, రైతుల ఆర్థిక భద్రత కూడా అంతే కీలకమని భావించే ఆయన, వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు మరియు ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన పద్ధతుల వైపు ప్రోత్సహిస్తున్నారు. మరి ఈయన గురించి, మరియు ఈ సుస్థిర వ్యవసాయ కేంద్రం గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం.Dr. Ramanujaneyulu emphasizes that both economic and environmental sustainability are vital for farmers. He established a Sustainable Agriculture Center to promote organic farming and train farmers in better practices.Host : BhavanaGuest : Dr. Ramanujaneyulu#TALRadioTelugu #SustainableFarming #OrganicAgriculture #FarmersFirst #AgriInnovation #FoodSecurity #TouchALife #TALRadio
Know Your Plate కార్యక్రమంలో భాగంగా గతవారం మనం వంట నూనెలపై చర్చించాం కదా… ఈ వారం కూడా అదే విషయాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. చాలామంది ఒకే రకం వంట నూనెని ఎప్పుడూ వాడుతూ ఉంటారు. మరికొంతమంది తరచూ నూనె మార్చుతూ ఉంటారు. మరి ఇందులో ఏది శ్రేయస్కరం? అలాగే రెండు లేక మూడు రకాల నూనెలను కలిపి వాడటం మంచిదేనా? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పోడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.In this episode of "Know Your Plate," renowned nutritionist Ashrita discusses whether sticking to one type of cooking oil is healthy, or if rotating or mixing oils is better. Tune in to learn the right way to use oils for a balanced diet.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioEnglish #HealthyCookingOil #NutritionTips #KnowYourPlate #OilRotationMyth #BalancedDiet #TouchALife #TALRadio
మహిళలకు నెలసరి అనేది ప్రతి నెలా వచ్చి 3 నుండి 7 రోజుల వరకు ఉంటాయి. ప్రతి మహిళకు 30 నుండి 35 సంవత్సరాల పాటు ఈ నెలసరి వస్తూవుంటుంది. కానీ ఈ నెలసరి సమయంలో, అధిక రక్తస్రావం, నొప్పి ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు.. తప్పక వినండి.. అవగాహన పెంచుకోండిMenstruation typically lasts 3 to 7 days each month for women over a span of 30 to 35 years. In this podcast, renowned Ayurvedic doctor Dr. Anupama shares effective Ayurvedic remedies for common period-related issues like heavy bleeding and pain.Host: RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #AyurvedaForWomen #MenstrualHealth #PeriodPainRelief #NaturalHealing #WomensWellness #TouchALife #TALRadio
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గతవారం లక్షిత వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారితో మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా మూర్తి గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు లక్షితను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎక్కువమందికి ఎలా సాహయం అందించాలనుకుంటున్నారు అనే అంశాలతో పాటు, కమ్యూనిటీ గివింగ్ అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రజలకు, చిన్న చిన్న సాయాలు చేసి, ఎలా ఆనందం పొందొచ్చు? ఫైనాన్సియల్ లిటరసీ మీద ప్రజలను ఎలా చైతన్యపరుస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. తప్పక వినండి. In this episode of "Spoorthi Kiranalu," Shri P.S.N. Murthy continues his inspiring conversation on the growth of Lakshita, the importance of community giving, and spreading financial literacy to empower more people. Don't miss this insightful discussion!Host : RenusreeGuest : P.S.N. Murthy#TALRadioTelugu #CommunityEmpowerment #FinancialLiteracy #LakshitaInitiative #InspiringConversations #SocialImpact #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నల్గొండకు చెందిన దీప్తి గారిని కలుసుకుందాం. ఆమె ఊరి అందాలు, చిన్ననాటి స్నేహితుల సరదాలు, తమ్ముడితో జరిగే చిన్న చిన్న గొడవలు ఇలా చాలా విషయాలు మనతో పంచుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడిన ఈమె, అంతరించిపోతున్న చేనేతను చిరకాలం ఉండేలా చెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. దీప్తి గారికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం.In this episode of "Maa Ooru," we meet Deepthi from Nalgonda, now settled in the U.S., who fondly shares memories of her village, childhood, and her passion to revive and preserve the fading handloom tradition.Host : UshaGuest : Deepthi#TALRadioTelugu #MaaOoru #HandloomRevival #NalgondaStories #CulturalHeritage #InspiringWomen #TouchALife #TALRadio
చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా నిరూపించిన రఘురాం గారితో గత వారం మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా రఘురాం గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు ఈ రీడ్ ఇండియా సెలెబ్రేషన్స్ ఎప్పుడు, ఎలా ప్రారంభమయ్యింది? అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఎలా ఒప్పుకున్నారు? అసలు చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. వినండి. In this week's podcast, Raghuram continues sharing the inspiring journey of Read India Celebrations—how it all began, how Amitabh Bachchan became the brand ambassador, and the transformative power of reading. Discover how reading can turn ordinary people into leaders.Host: BhavanaGuest : Raghuram Ananthoju#TALRadioTelugu #ReadIndiaCelebrations #PowerOfReading #RaghuramInterview #InspiringStories #LeadershipThroughReading #TouchALife #TALRadio
నూనె లేకుండా వంట చేయడం సాధ్యంకాదు. కానీ.. ఈ వంట నూనెతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. అందుకే వంట నూనెల ఎంపిక చాలా ముఖ్యమైనదని సూచిస్తారు నిపుణులు. మరి.. ఇంతకీ వంటకు ఏ నూనె వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి.. రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు మంచిది అని కొంతమంది చెబుతారు.. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మంచివి అని ఇంకొంతమంది చెబుతారు.. అయితే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ నివృత్తి చేయటానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సప్రగడ గారు మనతో ఉన్నారు.. ఈ విషయాలన్నీ ఈ పాడ్కాస్ట్ లో చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.. ఆరోగ్యంగా ఉండండి.In this podcast, renowned nutritionist Ashritha Vissapragada clarifies common doubts about cooking oils, including which type to use and in what quantity. She explains the differences between refined and cold-pressed oils and their impact on health.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #KnowYourPlate #HealthyCookingOils #NutritionTips #ColdPressedOil #RefinedOilMyths #TALRadioHealth #TouchALife #TALRadio
ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా గతవారం పొట్ట ఆరోగ్యం, దానికి ఎలా సరిగా ఉంచుకోవాలి అనే విషయాలు మాట్లాడుకున్నాము కదా, అయితే ఈ వారం పొట్ట సరిగా లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు? అసలు ఈ సమస్య రాకుండా ఉండటానికి మనం ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి మొదలైన విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు తెలియజేస్తున్నారు. వినండి మరి.As part of the Ayurveda Arogyam series, Dr. Anupama explains the health issues caused by poor gut health, Ayurvedic solutions, and essential dietary habits to prevent them.Host: RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #AyurvedaTips #GutHealth #AyurvedicRemedies #HealthyHabits #DrAnupamaSpeaks #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం తమిళనాడు లోని హరూర్ గ్రామానికి చెందిన పూజశ్రీ రంగనాథన్ గారిని కలుసుకుందాం. ఒక మారుమూల గ్రామంలో, ఒక ప్రశాంత వాతావరణంలో పెరిగిన ఈమె, ప్రస్తుతం అమెరికాలో మేకోవర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.. అసలు ఈ ప్రయాణం ఎలా సాగింది? తన రోజు ఎలా మొదలయ్యేది, అప్పటి స్నేహితులు, చదువుకున్న స్కూల్ , ఫ్యామిలీ, పేరెంట్స్ ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు .. తప్పక వినండిAs part of the "Maa Ooru" series, we meet Poojasri Ranganathan from Harur village, Tamil Nadu, who grew up in a peaceful rural setting and is now a successful makeover artist in the USA. She shares her inspiring journey, childhood memories, and family background.Host : UshaGuest : Poojasri Ranganathan#TALRadioTelugu #PoojasriRanganathan #MaaOoru #InspiringJourney #MakeoverArtist #HarurToUSA #TouchALife #TALRadio
ప్రతీ మనిషి ఈ భూమి మీదకు రావటానికి ఒక కారణం ఉంటుంది.. దానిని మనం పూర్తి చేసిన తరువాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం.. అందుకే నేను బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి, ఈ లక్షిత ను స్థాపించాను అంటున్నారు.. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారు. ఈ సంస్థ ముఖ్యంగా విద్య, వైద్యం, పేదవాడి ఆకలి తీర్చడం.. ఈ మూడు అంశాలమీద దృష్టిపెట్టింది.. 5గురు బాలికల విద్యకు సహకరించడంతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 127 మంది బాలికల విద్యకు సహకరించింది. ఈ సంస్థకు సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ లో విందాం.Mr. P.S.N. Murthy, founder of Lakshita Foundation, left his bank job to serve a higher purpose. The organization focuses on education, healthcare, and feeding the needy—supporting 127 girls' education so far.Host : RenusreeGuest : P.S.N. Murthy#TALRadioEnglish #LakshitaFoundation #PSNMurthy #GirlEducation #SocialService #InspiringStories #TouchALife #TALRadio
పుస్తకాల పట్ల, చదవటం మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఒక ఉద్యమంగా, ఉత్సవంగా మారింది.. అదే రీడ్ ఇండియా సెలబ్రేషన్స్. చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘురాం అనంతోజు గారు. ఒక్కడిగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అంటే, ఆయన లక్ష్యం ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు.. ఈ సంస్థకు సంబంధించిన మరిన్ని విషయాలు శ్రీ రఘురాం గారి మాటల్లోనే విందాం.What began as one man's love for books has grown into the Read India Celebrations movement. Founder Raghuram Ananthoju proved that reading can turn ordinary people into leaders, with Amitabh Bachchan now serving as the brand ambassador.Host : BhavanaGuest : Raghuram Ananthoju#TALRadioTelugu #ReadIndiaCelebrations #PowerOfReading #RaghuramAnanthoj #AmitabhBachchan #BookLoversMovement #TouchALife #TALRadio
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం ఉండాలి అంటారు.. అయితే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అసలు మన నిద్రకు ఉపకరించే హార్మోనులు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది? ఆహారమే కాదు మన అలవాట్లు కూడా మన నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి.. మరి వీటన్నింటి గురించి ఈ పాడ్కాస్ట్ లో సవివరముగా తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. తప్పక వినండి.Good sleep needs more than a full stomach—it needs the right habits and hormones. In this podcast, renowned nutritionist Ashritha explains how food and lifestyle affect our sleep quality.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #SleepHealth #NutritionForSleep #HealthyHabits #BetterSleepNaturally #SleepWellness #TouchALife #TALRadio
పొట్ట ఆరోగ్యంగా ఉండడం వల్ల శరీరంలోని చాలా సమస్యలను నివారించవచ్చు. జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, మానసిక ఆరోగ్యం ఇలాంటివి అన్నీ పొట్ట ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ గారు పొట్ట ఆరోగ్యానికి అవసరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులు, మరియు ఆరోగ్య సూత్రాలను ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు... తప్పక వినండి.. ఆరోగ్యమైన జీవితం కోసం మొదటగా మనం చూసుకోవలసిందేమిటో తెలుసుకోండి.Maintaining gut health can prevent various issues related to digestion, immunity, and mental well-being. In this podcast, Ayurvedic expert Dr. Anupama shares essential diet habits, lifestyle tips, and health principles for a better life.Host: RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #AyurvedamArogyam #GutHealth #AyurvedaTips #HealthyLiving #DigestiveWellness #MindBodyBalance #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా నెల్లూరుకు చెందిన మయూష రెడ్డి గారితో మాట్లాడదాం. అప్పటి కుటుంబ వ్యవస్థ, ఇప్పటి కుటుంబ వ్యవస్థ.. రెండింటికి ఉన్న తేడాలు ఏమిటి? ప్రస్తుత పరిస్థితులలో పిల్లలను పెంచడం, వాళ్ళను మంచిదారిలో నడిచేటట్లు చేయటం ఎలా? ఇలాంటి ఎన్నో విషయాలు, సరదా కబుర్లు, స్కూల్ లో జరిగిన అల్లరి సన్నివేశాలు.. ఇవన్నీ మీకోసం ఈ పాడ్కాస్ట్ లో..In this episode of Maa Ooru, Mayusha Reddy from Nellore shares insights on changing family systems, parenting today, and nostalgic school memories.Host : UshaGuest : Mayusha Reddy#TALRadioTelugu #FamilyValues #ParentingTips #TeluguPodcast #ChildhoodMemories #MaaOoruSeries #TouchALife #TALRadio
జీవితంలో ఎంత సంపాదించినా, సమాజంలో ఎవరికైనా సాహయం చేయటంలో ఉన్న సంతృప్తే వేరు.. అందుకే కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఈ దారిని ఎంచుకున్నాను అంటున్నారు.. భవిష్య సంకల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ భవిత గారు. 2019వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ సంస్థ, ముఖ్యంగా విద్య మరియు మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ చేస్తున్న మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాము.Bhavitha, founder of Bhavishya Sankalp Foundation, left her corporate job to serve society. Since 2019, her NGO has been working for education and women empowerment.Host : NIkhitha NellutlaGuest: Bhavitha#TALRadioTelugu #WomenEmpowerment #EducationForAll #SocialImpact #NGOIndia #InspiringJourney #TouchALife #TALRadio
ఈ వారం know your plate పాడ్కాస్ట్ లో పిల్లల లంచ్ బాక్స్ లో ఏమి పెట్టాలి అనేది మాట్లాడుకుందాం. పిల్లలు ఇష్టంగా తినగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి.. అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి? ఏ ఏ ఫుడ్ గ్రూప్స్ పెడితే, పిల్లలకు ఆరోగ్యంగా సాయంత్రం వరకు యాక్టీవ్ గా ఉండగలుగుతారు? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరిస్తున్నారు. తప్పక వినండిThis week's Know Your Plate podcast explores healthy and tasty lunchbox ideas for kids. Renowned nutritionist Ashrita shares tips on balanced food groups to keep children active all day.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioEnglish #HealthyKids #LunchboxIdeas #ChildNutrition #KnowYourPlate #ParentingTips #TouchALife #TALRadio
నీళ్లు సరిగ్గా తాగితేనే ఆరోగ్యం అంటోంది ఆయుర్వేదం. అయితే ఈ నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి?లాంటి విశేషాలు అన్నీ గతవారం ఎపిసోడ్ లో తెలుసుకున్నాం . అయితే ఈ వారం ఎపిసోడ్ లో అనారోగ్యంగా ఉన్నపుడు మంచి నీటి అవసరం ఎంత ఉంది? ఎలా తాగాలి? అనే విషయాల్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు వివరిస్తున్నారు .. తప్పక వినండి మరి..In last week's episode, we explored the importance of proper water intake for good health through Ayurveda. This week, Dr. Anupama shares insights on how and how much water to drink during illness.Expert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedaTips #HealingWithWater #HydrationMatters #AyurvedicHealth #WellnessWisdom #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నెల్లూరుకు చెందిన మయూష రెడ్డి గారిని కలుసుకుందాం. నెల్లూరు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఫుడ్. గాంధీ బొమ్మ దగ్గర ఉన్న జైహింద్ షాప్ లో ఉన్న మలైకాజా, చేపల పులుసు, నెల్లూరు కారం దోశ ఇలా ఎన్నో ఉన్నాయి.. ఇక్కడ దేవాలయాలు, పండుగలకు కూడా ఎంతో ప్రత్యేకం. ఇలా వాళ్ళ ఊరు కు చెందిన అనేక విషయాలతో పాటు, తన కుటుంబం, పెళ్లి గురించి, తన జీవితాశయం గురించి చాలా విషయాలు మనతో పంచుకుంటున్నారు.. మరి వినేద్దామా?In this week's Maa Ooru episode, we meet Mayusha Reddy from Nellore, who shares about her hometown's famous food, temples, festivals, family, marriage, and life aspirations.Host : UshaGuest : Mayusha Reddy#TALRadioTelugu #MaaOoru #NelloreDiaries #TeluguCulture #MayushaReddy #NelloreFoodSpecials #TouchALife #TALRadio
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి, శీతాకాలంలో వేడినిచ్చే ఆహారాలు తీసుకోవాలి. వర్షాకాలంలో తేమ, గాలిలో తేడాలు సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదం చేస్తాయి, కాబట్టి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. వీటి గురించి మరిన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రీత గారు ఈ పాడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు. తప్పక వినండిAdapting our diet to seasonal changes is essential — cooling foods in summer, warming foods in winter, and hygienic food during the monsoon to avoid infections. Nutritionist Ashrita shares more valuable tips in this podcast — don't miss it!Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #KnowYourPlate #SeasonalEating #HealthyDietTips #MonsoonHealth #NutritionAdvice #PodcastRecommendation #TouchALife #TALRadio
నీళ్లు సరిగ్గా తాగితేనే ఆరోగ్యం అంటోంది ఆయుర్వేదం. అయితే ఈ నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? గోరువెచ్చని నీళ్లు తాగడం వలన కలిగే లాభాలు ఏమిటి? భోజనం చేస్తున్న మధ్యలో నీళ్లు తాగవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు కలుగుతుంటాయి.. అయితే వీటన్నింటిని వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు మనతో ఉన్నారు.. ఈ పాడ్కాస్ట్ లో ఆ వివరాలన్నీ తెలియజేస్తున్నారు.Ayurveda emphasizes the importance of proper water intake for good health. In this podcast, Dr. Anupama explains when, how much, and how to drink water, including the benefits of warm water and common myths around drinking during meals.Host : RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedaTips #HealthyHydration #DrinkWarmWater #WaterIntakeGuide #AyurvedicHealth #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కరీంనగర్ కు చెందిన శిరీష గారిని కలుసుకుందాం. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులతో సరదా సన్నివేశాలు, కుటుంబంలో చూపించే ప్రేమానురాగాలు, భార్యాభర్తల బంధం, ఇలాంటి విషయాలే కాకుండా.. కరీంనగర్ లో.. రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ దగ్గర దొరికే బాదం మిల్క్, జిలేబీ.. సమోసా.. తెలంగాణలో చేసుకునే దావత్ ల గురించి ఇలా చాలా విషయాలు సరదా సరదాగా మనతో పంచుకున్నారు.. వినండి.. ఆనందించండి.. మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకోండి.This week on Maa Ooru, we meet Sirisha from Karimnagar as she shares joyful memories from childhood, family bonds, local treats like badam milk and samosas, and the flavors of Telangana. Tune in for a nostalgic and heartwarming ride.Host : UshaGuest : Sirisha#TALRadioTelugu #MaaOoruPodcast #KarimnagarStories #TelanganaFlavors #NostalgicMoments #CulturalConnections #TouchALife #TALRadio
మన ఆలోచనలకి మొదలు ఎక్కడో చాలా సార్లు కనిపెట్టలేము, ఎందుకు నేను ఈ మధ్య ప్రతి విషయానికి చిరాకు పడుతున్నాను? ఎందుకు ఆనందం గా ఉండలేక పోతున్నాను? ఎవరితోనూ ఎందుకు కలవలేక పోతున్నాను? ఇలా మీకు అనిపిస్తుంటే, తప్పకుండా శ్రీ విద్య గారు చెప్పే మాటలు వినాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే ట్రాప్ లో పడిపోతున్నాం అంటున్నారు శ్రీ విద్య గారు. ఎలా? పరిష్కారం ఏంటి? ఈ పాడ్కాస్ట్ వింటే తెలుసుకోవచ్చు.Are you feeling irritated, joyless, and disconnected without knowing why? Listen to Srividya as she reveals how we unknowingly fall into mental health traps—and how to break free.Host : Rama IragavarapuExpert : Dr. Sri VidhyaPsychotherapist | Hypnotherapist | Transformation CoachCofounder & Clinical Head- Myndwell#TALRadioTelugu #MentalHealthAwareness #EmotionalWellbeing #MindTraps #SelfHealing #PodcastInsights #TouchALife #TALRadio
ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. అయితే రకరకాల వ్యాయామాలు, డైట్ ప్లాన్స్ తో బరువు తగ్గినప్పటికీ, కొద్ది కాలంలోనే మళ్ళీ బరువు పెరిగిపోతున్నారు. అందుకే తగ్గిన బరువు ను నిలబెట్టుకోవడం కూడా ఓ సవాలే. మరి ఈ తగ్గిన బరువు ను పెరగకుండా ఎలా చూసుకోవాలి? అసలు ఆలా బరువు పెరగటానికి గల కారణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు. తప్పక వినండి.Weight regain after losing it is a common issue faced by many. In this podcast, renowned nutritionist Asritha Vissapragada shares valuable tips on maintaining weight loss and the reasons behind weight gain.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #WeightManagement #HealthyLifestyle #NutritionTips #StayFit #AsrithaVissapragada #TouchALife #TALRadio
గతవారం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు, వాటి పరిష్కారాలు గురించి మాట్లాడుకున్నాం కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు.. దీనికి గల కారణాలు ఏమిటి? దీనిని ఎలా పరిష్కరించవచ్చు.. అలాగే మెనోపాజ్ లో వచ్చే సమస్యలు, కారణాలు, మరియు పరిష్కారాలు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు. తప్పక వినండి.In this week's episode of the Ayurveda Arogyam series, Dr. Anupama discusses early puberty in children and menopause-related issues in women — their causes and Ayurvedic solutions. Don't miss this insightful conversation!Host : RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedaForWomen #HormonalHealth #EarlyPubertyAwareness #MenopauseSupport #NaturalHealing #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం గంపలగూడెం గ్రామానికి చెందిన మణికనకరాజు గారిని కలుసుకుందాం. తన చిన్ననాటి స్నేహితులు, అల్లరి పనులు, స్నేహితులతోకలసి నేల టికెట్ కొనుక్కొని సినిమా చూడటం, శ్రీరామనవమి ఉత్సవాలు, జూనియర్ కాలేజీ కోసం చేసిన నిరాహారదీక్షలు, అమెరికాకు ఆ ఊరుకు ఉన్న అనుబంధం.. అంతేకాదు ముఖ్యంగా గంపలగూడెం అనగానే గుర్తొచ్చేది జమీందారు కోట. ఆ కోట కోసం చాలా కథలు చెప్పేవారు..మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వినండిIn this week's episode of Maa Ooru, we meet Manikanakaraju from Gampalagudem as he shares nostalgic stories of childhood mischief, village festivals, cinema outings, and the legendary Zamindar fort that shaped the identity of the village.Host : ushaGuest : Mani Kanaka Raju#TALRadioTelugu #MaaOoruStories #VillageMemories #GampalagudemDiaries #NostalgicNarratives #TouchALife #TALRadio
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఈ 3 సంవత్సరాల సాన్వికకు అక్షరాలా వర్తిస్తుంది. విజయవాడకు చెందిన సాన్విక 2 సంవత్సరాల 8 నెలల వయసులో ఇన్లైన్ స్కేటింగ్లో 400 మీటర్ల రికార్డు సాధించి, ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అసలు ఇది ఎలా సాధ్యమయింది? తనకు ఎప్పటినుండి స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించారు? అసలు స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సాన్విక పేరెంట్స్ - రవితేజ & నవ్య గారి మాటల్లో విందాం..At just 2 years and 8 months old, Sanvika from Vijayawada set a 400-meter inline skating record, earning a spot in the International Book of Records. In this podcast, her parents Raviteja and Navya share the inspiring journey behind her early achievement.Host : KiranmaiGuest : Ravi Teja & Navya Parents of Saanvika#TALRadioTelugu #YoungAchiever #SanvikaSkatingStar #InlineSkatingRecord #InspiringKids #TouchALife #TALRadio
యోగ సాధన ద్వారా రోగమే కాదు .. రోగ మూలాలను కూడా తొలగించవచ్చు అంటున్నారు YOGA CONSCIOUSNESS TRUST, హైదరాబాద్ శాఖ కార్యదర్శి శ్రీ వి. హనుమాన్ గారు. యోగ సాధన, యోగ క్రియల ద్వారా Lifestyle diseases ను కూడా నివారించవచ్చు అంటున్నారు.. అసలు ఈ యోగా ఏ వయసువారు చేయవచ్చు? రోజుకు ఎంత సమయం చెయ్యాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు .. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా టాల్ రేడియో అందిస్తున్న ఈ పాడ్కాస్ట్ విని, మన జీవితాలను కూడా ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా చేసుకోవటానికి ప్రయత్నిద్దాం.In this special International Yoga Day podcast by TAL Radio, Sri V. Hanuman from Yoga Consciousness Trust, Hyderabad, shares how yoga not only cures diseases but also eliminates their root causes, helping all age groups prevent lifestyle disorders with regular practice.Host : KiranmaiGuest : V. HanumanSecretary OfYOGA CONSCIOUSNESS TRUST, Hyderabad BranchYou Can Reach YOGA CONSCIOUSNESS TRUST @https://www.yogaconsciousness.org/#TALRadioTelugu #InternationalYogaDay #YogaForHealth #LifestyleWellness #HealingWithYoga #TouchALife #TALRadio
కళలు నేర్చుకోవటం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆ కళను నేర్చుకొని, దాని ద్వారా సమాజంలో ఎంతోకొంత మార్పును తేవాలనే కోరిక, తపన కొంతమందికే ఉంటుంది. అలాంటి కోవకు చెందినవారే, తెలుగు రాష్ట్రంలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన పద్మ చేబ్రోలు గారు. ఈమె చిన్ననాటి నుండి నృత్యం పై ఉన్న ఆసక్తి తో నేర్చుకొని, అమెరికా వెళ్ళాక కూడా అక్కడివారికి మన నృత్య సంప్రదాయాల్ని బోధిస్తూ, సమాజంలో చైతన్యాన్ని నింపే చిత్రాలు నిర్మిస్తూ, సమాజానికి తనవంతు సేవను అందిస్తున్నారు. అందుకే 2025 సంవత్సరానికి గాను ఒహియో గవర్నర్ అవార్డు ను అందుకున్నారు. ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం.Padma Chebrolu, originally from Telugu states and now based in the U.S., has been promoting Indian classical dance and social awareness through her art, earning the prestigious 2025 Ohio Governor's Award. Her journey reflects passion, purpose, and cultural impact.Host : KiranmaiGuest : Padma Chebrolu #TALRadioTelugu #PadmaChebrolu #CulturalAmbassador #DanceForChange #OhioGovernorsAward #TeluguPride #TouchALife #TALRadio
మహిళల ఆరోగ్యానికి వస్తే వివిధ వయసులలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ఎంత సమయం వ్యాయామానికి కేటాయించాలి? విటమిన్ డెఫిషియన్సీని ఎలా గుర్తించాలి? మెనోపాజ్ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు. తప్పక వినండి.Renowned nutritionist Ashritha Vissapragada shares vital insights on women's health, including age-wise diet tips, exercise routines, vitamin deficiencies, and menopause care. Don't miss this informative session!Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #WomensHealth #NutritionTips #MenopauseCare #VitaminDeficiency #HealthyLifestyle #TouchALife #TALRadio
మన జీవితాన్ని, లైఫ్ స్టైల్‌ను మెరుగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది. అయితే ఇది ముఖ్యంగా మహిళలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హార్మోనుల అసమతుల్యత వలన ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి? ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.Hormonal imbalance, especially common among women due to modern lifestyle, stress, and poor diet, is discussed in depth by Ayurvedic expert Dr. Anupama in this podcast. She shares how to identify and naturally treat it through Ayurveda.Host : RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #HormonalHealth #AyurvedaHealing #WomenWellness #StressAndHormones #HealthyLifestyleTips #TouchAlife #TALRadio #TALPodcast
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. అమెరికా వచ్చిన తరువాత తన ప్రయాణం ఎలా సాగింది? అసలు Priya's Makeover ప్రారంభించటానికి గల కారణం ఏమిటి? తన Passion, Profession గా ఎలా మారింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు.As part of the "Maa Ooru" series, we meet Shanmugapriya from Coimbatore, who shares her inspiring journey after moving to the US and how her passion led to the launch of Priya's Makeover. She talks about turning her dream into a profession in this engaging podcast.Host : UshaGuest : Shanmuga Priya#TALRadioTelugu #PriyasMakeover #MaaOoruPodcast #InspiringJourney #PassionToProfession #WomenEntrepreneurs #TouchALife #TALRadio
ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గూర్చి, సంస్థ AP & TS యాక్టింగ్ ఇంచార్జ్ శ్రీ యెతేంద్ర యాదవ్ గారితో గతవారం మాట్లాడాము కదా, ఈవారం కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.. పెద్దల సంరక్షణలో టెక్నాలజీ పాత్ర ఏమిటి? వారికోసం ఏమైనా ప్రత్యేకమైన Apps ఉన్నాయా? అసలు పెద్దవాళ్ళతో మనం ఎలా మెలగాలి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.In this week's podcast, we continue our conversation with Mr. Yethendra Yadav, Acting In-Charge of HelpAge India (AP & TS), exploring the role of technology in elderly care, special apps designed for seniors, and how we should interact with the elderly with empathy and respect.Host : KiranmaiGuest : Yetendra Yadav#TALRadioTelugu #ElderlyCare #HelpAgeIndia #SeniorCitizens #TechnologyForSeniors #EmpathyAndRespect #TouchALife #TALRadio
కుటుంబంలో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే మహిళలలో పోషకాల అవసరాలు భిన్నంగా ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి.. అందుకే మహిళలు వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.A healthy woman means a healthy family. Renowned nutritionist Ashrita Vissapragada shares essential dietary tips and precautions for women of different age groups in this insightful podcast.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #KnowYourPlate #Asritha #WomensNutrition #HealthyEating #BalancedDiet #CleanEating #FoodForHormonalBalance #FoodForWomen #Renusree #touchalife #talradio
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మన జీవితంలో ఒక భాగమయ్యాయి. కానీ ఇవి ఎంత మేలు చేస్తున్నాయో.. అంత కీడు కూడా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు, గాడ్జెట్‌లు మన నిద్రను పాడుచేయటం, ఫలితంగా మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిద్రలేమికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్యను ఆయుర్వేదం ద్వారా ఎలా నివారించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. తప్పక వినండి.Electronic gadgets are deeply affecting our sleep and brain health, say experts. In this podcast, renowned Ayurvedic doctor Dr. Anupama shares causes of insomnia and how Ayurveda offers natural remedies.Dr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedaForSleep #InsomniaCure #DigitalDetox #DrAnupama #SleepHealth #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. చిన్ననాటి పరిస్థితులు, కోయంబత్తూరు అందాలు.. దేవాలయ ప్రాంగణాలు.. చదువుకున్న పాఠశాలలు, బంధువులు, స్నేహితులు ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు కోయంబత్తూరు నుండి అమెరికా వరకు తన జీవన ప్రయాణం ఎలా సాగిందో మనతో ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. వినండి మరి..In this week's "Maa Ooru" episode, we meet Shanmugapriya from Coimbatore as she shares her childhood memories, the beauty of her hometown, and her inspiring journey from Coimbatore to America. Tune in to hear her heartfelt story of roots, relationships, and resilience.Host : UshaGuest : Shanmugapriya#TALRadioTelugu #MaaOoru #InspiringJourney #CoimbatoreToUSA #LifeStories #PodcastInterview #TouchALife #TALRadio
ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. దీనితోపాటు, సమాజమే వృద్ధులను చూసుకోవాలి అనేది వీరి నినాదం. దీనికి గాను యువతకు కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వృద్దుల పట్ల మనం ఎలా ఉండాలి? వారి ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలి? వృద్ధాప్యంలో వారిని ఎలా చూసుకోవాలి? లాంటి ఎన్నో అంశాలపై ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తుంది.. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు AP & TS యాక్టింగ్ ఇంచార్జ్ శ్రీ యెతేంద్ర యాదవ్ గారు ఈ ఇంటర్వ్యూ లో వివరిస్తున్నారు. తప్పక విని, పెద్దల పట్ల ప్రేమతో మెలగండి.HelpAge India is dedicated to supporting the elderly by addressing their needs, offering emotional support, and spreading awareness on elder care through youth programs. In this interview, AP & TS Acting In-Charge Sri Yetendra Yadav shares insights on how society can better care for its senior citizens.Host : KiranmaiGuest : Yetendra Yadav#TALRadioTelugu #ElderCare #HelpAgeIndia #SupportSeniors #EndElderLoneliness #RespectForElders#TouchALife #TALRadio
మన ఆరోగ్యం మన వంటింటి నుండే ప్రారంభమవుతుంది.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం. అదేవిధంగా మనం జంక్ ఫుడ్ కి అలవాటు పడితే, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? మన బాడీ మనకు ఇచ్చే సూచనలను ఎలా గమనించాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు .. తప్పక వినండి.Our health begins in the kitchen. In this podcast, renowned nutritionist Ashrita Vissapragada shares essential tips on choosing the right food, proper portions, and understanding our body's signals for better health.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #HealthyEating #NutritionTips #WellnessPodcast #MindfulEating #AshritaVissapragada #TouchALife #TALRadio
ఈ రోజుల్లో నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్, పని వత్తిడి కారణంగా చాలామందికి సరిగ్గా నిద్రపట్టక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్ళలో ఆత్మవిశ్వాసం లోపించటం, డిప్రెషన్, ఆందోళన, కోపం, గందరగోళం మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ఈ నిద్రలేమి వలన ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ నిద్రలేమి సమస్యను ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. తప్పక వినండి.Sleep deprivation is a growing issue today, leading to anxiety, depression, and poor mental health. In this podcast, renowned Ayurvedic doctor Dr. Anupama shares natural solutions to overcome insomnia.Dr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedamArogyam #SleepHealth #AyurvedaForSleep #MentalWellness #InsomniaCure #HolisticHealing #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా అరుణ గారితో సంభాషిద్దాం.. . అప్పటి రోజులలో పండుగలు అంటే బంధువులంతా కలసి ఒకేచోట చేరి సందడిగా జరుపుకునేవారు.. కానీ ఇప్పటి యాంత్రిక జీవనంలో మనం పండుగలు ఎలా జరుపుకుంటున్నాము? అలాగే అప్పటి పేరెంటింగ్ కి ఇప్పటి పేరెంటింగ్ కి తేడా ఏమిటి? అసలు మనం పిల్లలతో ఎలా ఉండాలి? మనల్ని మనం ప్రేమించుకోవటం అవసరమా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు . వినండి.In this episode of Maa Ooru, Aruna garu reflects on how festivals and parenting have changed over time, and emphasizes the importance of self-love and meaningful connections in today's fast-paced life.Host : UshaGuest : Aruna Nagireddy#TALRadioTelugu #Parenting #FestivalTraditions #SelfLove #ModernLife #MaaOoruPodcast #TouchAlife #TALRadio
అవయవ దానం అన్ని దానాలలో మిన్న.. ఎందుకంటే ఒక మనిషి యొక్క అవయవాలు 6 నుండి 8 మంది జీవితాలలో వెలుగులు నింపగలదు. అయితే, ఈ అవయవ దానానికి ఒప్పించటంలో ముఖ్యమైనది కౌన్సిలింగ్.. అంతేకాదు ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ గా ధృవీకరించటానికి నలుగురు వైద్యులు నిర్ధారించవలసి ఉంటుంది.. ఒక వ్యక్తి మరణం నుండి.. తన అవయవాలు వేరే వ్యక్తులకు చేరేవరకు అసలు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఆ అవయవాలు ఏ ఏ వ్యక్తులకు కేటాయించాలి అన్నది అసలు ఎవరు చేస్తారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు డా|| భానుచంద్ర గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు.. తప్పక వినండి.. అవయవదానంపై అవగాహన పొందండి.Dr. Bhanu Chandra explains the vital process and importance of organ donation, from brain death confirmation to organ allocation.Host : KiranmaiGuest : Dr.BhanuChandra#TALRadioTelugu #OrganDonation #LifeSaver #HealthAwareness #BrainDeath #DonateOrgans #TouchALife #TALRadio
పూర్వపు జీవనశైలికి ప్రస్తుత ఆధునిక జీవనశైలికి ఎన్నో తేడాలు ఉన్నాయి.. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు.. అప్పటి రోజుల్లో పొట్టుతోకూడిన ధాన్యాలను తింటే, ఇప్పుడు అంతా పోలిష్డ్ & ప్రొసెస్డ్ ఫుడ్ తింటున్నాము. అప్పట్లో మన జీవన విధానంలోనే శారీరక శ్రమ ఉండేది.. కానీ నేటి టెక్నాలజీ పుణ్యమా అని, శారీరక శ్రమ అస్సలు లేకుండా పోయింది.. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకుంటే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చక్కగా వివరిస్తున్నారు. వినండి..This podcast features renowned nutritionist Ashrita explaining the key differences between traditional and modern lifestyles, especially in food habits, and offers practical tips for staying healthy and happy today.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #KnowYourPlate #HealthyLiving #NutritionTips #TraditionalVsModern #WellnessPodcast #EatRightLiveWell #TouchALife #TALRadio
అందమైన కురుల కోసం ప్రతి మగువ తపన పడుతుంది. మరి అందమైన మరియు ఆరోగ్యకరమైన కురుల కోసం మనం ఏమి చెయ్యాలి? ఆయుర్వేదం ద్వారా అందమైన మరియు పొడవైన కురులను పొందవచ్చా? దీనికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అనేక విషయాలు మనకు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారుఈ పాడ్కాస్ట్ లో వివరించారు . మరి విందామా?Every woman dreams of beautiful, healthy hair. In this podcast, renowned Ayurvedic doctor Anupama shares tips and remedies for achieving long, strong hair through Ayurveda.Host : Renusree Guest: Dr.Anupama Uppuluri Dr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedaForHair #HealthyHairTips #NaturalBeauty #HairCareRoutine #AyurvedicRemedies #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం అరుణ గారిని కలుసుకుందాం.. అరుణగారు పుట్టింది రాయలసీమ.. కానీ పెరిగింది చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య. తన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వలన చాలా ప్రాంతాలు తిరిగారు, కానీ ఎక్కడకు వెళ్లిన అటవీ ప్రాంతంలోనే ఉండేవారు కాబట్టి, అక్కడి పచ్చదనం, పక్షుల కిలకిల ధ్వనులు, జంతువుల మధ్య పెరగటం చాలా బాగుండేది.. అప్పుడప్పుడు పులుల అరుపులు కూడా వినేవాళ్ళం అంటున్న అరుణ గారి చిన్ననాటి జ్ఞాపకాలు వివరంగా తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ వినాల్సిందే..In this week's Maa Ooru episode, we meet Aruna, who was born in Rayalaseema but grew up amidst the lush coffee estates and forests of Chintapalli. She shares nostalgic childhood memories of living close to nature, surrounded by greenery, birdsong, and even the occasional roar of tigers.Host: UshaGuest : Aruna Nagireddy#TALRadioTelugu #MaaOoruPodcast #ArunaStories #ForestLifeMemories #ChintapalliChronicles #NatureInspiredChildhood #TouchAlife #TALRadio
స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. అమెరికాలో నివసిస్తున్న ఈమెకు ఇండియాలో, హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఆశాజ్యోతి సంస్థతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడనుండి ఆ సంస్థలో ఉన్న వారికి ఎలాంటి సహాయసహకారాలు అందిస్తున్నారు? ఈ సంస్థను మరింత విస్తరించి, మరికొంతమంది జీవితాలలో వెలుగులు నింపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇలాంటి అనేక విషయాలు ఈ పాడ్కాస్ట్ లో ముచ్చటిద్దాం.In this week's Spurthi Kiranalu episode, we talk to Vani Dittakavi, a US-based supporter of Asha Jyothi Foundation in Hanuman Junction, about her inspiring connection, ongoing support, and vision to expand the organization's impact.Host : RenusreeGuest : Vani Dittakavi#TALRadioTelugu #SpurthiKiranalu #VaniDittakavi #AshaJyothi #InspiringStories #CommunitySupport #TouchALife #TALRadio
అన్ని దానాలలో కన్నా ప్రాణదానం గొప్పది. ప్రాణదానానికి ముఖ్యమైనది అవయవదానం. అయితే దీనిపై చాలామందికి అవగాహన లేదు. మరి ఇలాంటి అవయవ దానంపై ప్రజలలో అవగాహన పెంచి, వారిని అవయవదానానికి ఒప్పించి, ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతుంది మోహన్ ఫౌండేషన్. ఈ మోహన్ ఫౌండేషన్ లో గత 14 సంవత్సరాలుగా తన అమూల్యమైన సేవలను అందిస్తున్న డా|| భానుచంద్ర గారి ప్రయాణం గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అసలు మోహన్ ఫౌండేషన్ తో ఈయన ప్రయాణం ఎలా మొదలైంది? అవయవదానంపై అవగాహనా కలిగించేటప్పుడు ఎదురైన. అవుతున్న సమస్యలు ఏమిటి? కౌన్సిలింగ్ ద్వారా ఈ అవయవదానానికి ఎలా ఒప్పించగలుగుతున్నారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు . వినండి.This podcast episode explores Dr. Bhanu Chandra's 14-year journey with the MOHAN Foundation, his efforts in raising awareness about organ donation, and the challenges faced in counseling people to become donors.Host : KiranmaiGuest : Dr.BhanuChadraYou can Reach MOHAN Foundation @https://www.mohanfoundation.org/#TALRadioTelugu #OrganDonation #MOHANFoundation #BhanuChandra #AwarenessMatters #PodcastStory #TouchALife #TALRadio
అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే అంటూ మొదలైన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము, దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో కూడా చాలా చక్కగా వివరించారు .. వినండి..Rice and chapati are both healthy, but the better choice depends on one's location, health, and digestive system. In this podcast, renowned nutritionist Ashrita continues the insightful discussion on this topic.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com#TALRadioTelugu #KnowYourPlate #HealthyEating #RiceVsChapati #NutritionTips #DigestiveHealth #DietAdvice #TouchAlife #talradio
జుట్టు మన అందాన్ని మరింత పెంచుతుంది.. పొడవాటి, ఒత్తైన మెరిసేటి జుట్టు కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది.. కానీ ఈ మధ్య జుట్టు రాలే సమస్య స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరిలో కనిపిస్తుంది. అసలు జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటి? ఆయుర్వేదం ద్వారా మనం ఈ జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చు? ఇలాంటి అనేక విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ పంచుకున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు.. తప్పక వినండి.Hair fall has become a common issue for all ages. In this podcast, renowned Ayurvedic doctor Dr. Anupama Uppuluri shares insights on the causes and Ayurvedic remedies for hair loss.Host : Renusree Guest: Dr.Anupama Uppuluri Dr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #HairCare #AyurvedaTips #HairFallSolutions #NaturalRemedies #HealthyHair #TouchALife #TALRadio
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా శ్రీనివాస్ ఖేదం గారితో ముచ్చటిద్దాం.. టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన అసలు న్యూజిలాండ్ ఎలా వెళ్లారు? అక్కడ నుండి అమెరికా ఎలా వెళ్లారు? టీచర్ వృత్తిలో ఉన్నవారు అమెరికా వెళ్లి సెటిల్ అవ్వగలరా? అమెరికా పాఠశాలలో మనం పనిచేయటానికి అర్హులమా? అక్కడ స్కూల్ లో పనిచేయాలి అంటే ఏమైనా ప్రత్యేకమైన కోర్స్ చెయ్యాలా? ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వినండి.In this week's Maa Ooru episode, we chat with Srinivas Khedam, who began his career as a teacher and later moved to New Zealand and then the USA. He shares valuable insights on how Indian teachers can settle and work in American schools.Host: UshaGuest : Srinivas Khedam#TALRadioTelugu #TeachingAbroad #EducationCareers #TeluguPodcast #MaaOoru #InspiringJourneys #TouchALife #TALRadio